సంతకవిటి : స్థానిక మండలం జి.యస్.పురం పశువైద్యశాల వైద్య సదుపాయాలు లేమి ఒక ప్రక్క వెంటాడుతుంటే, హాస్పిటల్ ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మరోప్రక్క మారడంతో సిబ్బందికి అలాగే హాస్పిటల్ కు మూగజీవాలు తీసువచ్చే ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నాయి.ఈ హాస్పిటల్ జనసంచారానికి చాటుగా ఉండటంవల్ల మందు బాబులకు అడ్డాగా మార్చుకుని ఉపయోగగపడుతుండటం పట్ల సిబ్బందికి ఇబ్బందిగా ఉన్నా ఏమీ అనలేక సర్దుకు పోతున్నారు.వైద్యశాలకు మూగ జీవులను తీసుకొని వచ్చే వారు కూడా ఈ మందుబాబుల వ్యవహారం పట్ల ఇబ్బందులు ఎదుర్కోవటం జరుగుతుంది.దీనిపై గ్రామ ప్రజలు అధికారులు స్పందించి వీటిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గుళ్ళ సీతారామ్ పురం పశు వైద్యశాల మందుబాబులకు అడ్డా